Hyderabad, అక్టోబర్ 9 -- ఇండియన్ ఓటీటీలోని టాప్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మహారాణి. సోనీ లివ్ ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈ నాలుగో సీజన్ ట్రైలర్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని గురువారం (అక్టోబర్ 9) మేకర్స్ అనౌన్స్ చేశారు. 'మహారాణి 4' నవంబర్ 7న SonyLIVలో విడుదలవుతుందని మేకర్స్ ఎట్టకేలకు వెల్లడించారు. ఈ కొత్త సీజన్లో రాణీ భారతి పాట్నాను వదిలి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు చూపించారు.

ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ మహారాణి. తొలి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 'మహారాణి 4' కేవలం పాట్నాలో అధికారం కోసం జరిగే పోరాటంపై మాత్రమే కాకుండా.. దేశ సింహాసనం కోసం జరిగే పోరాటంపై కూడా దృష్టి పెడుతుంది. ఈ కొత్త సీజన్ రాణి భ...