Hyderabad, ఆగస్టు 4 -- విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్'. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మరో హీరో సత్యదేవ్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, కన్నడ యాక్టర్ వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన కింగ్డమ్ సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే, 'కింగ్డమ్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో తాజాగా పాత్రికేయులతో ముచ్చటించిన హీరో సత్యదేవ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

-ఇప్పటిదాకా ఈ సినిమాకి వచ్చినన్ని ఫోన్ కాల్స్ నాకు ఎప్పుడూ రాలేదు. మొదటి షో నుంచి అందరూ ఫోన్లు చేసి అభినందిస్తూనే ఉన్నారు. గౌతమ్ నాకు ...