భారతదేశం, జూన్ 25 -- రక్త క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాధులు ముఖ్యంగా ల్యూకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా వంటి వాటిని ముందే గుర్తించడం చాలా కీలకమని విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ మెడికల్ ఆంకాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్ డాక్టర్ శ్రావణ్ కుమార్ వివరించారు.

'ఎందుకంటే, ఈ వ్యాధులు మొదట్లో స్పష్టమైన లక్షణాలను చూపించవు. కొన్నిసార్లు అవి సాధారణ ఆరోగ్య సమస్యల్లాగే అనిపిస్తాయి, నిదానంగా శరీరం లోపల విస్తరిస్తుంటాయి. మనం గుర్తించడంలో ఆలస్యం జరిగితే, చికిత్స అందించడం, ప్రాణాలను కాపాడటం మరింత కష్టమవుతుంది..' అని డాక్టర్ శ్రావణ్ తెలిపారు.

అందుకే, మన శరీరంలో కనిపించే చిన్న మార్పులను కూడా అస్సలు తేలికగా తీసుకోకూడదని, కొన్ని హెచ్చరిక సంకేతాలను మనం సకాలంలో గుర్తించగలిగితే, ప్రాణాలను కాపాడుకోవచ్చునని వివరించారు.

ఇది మామూలు అలసట కాదు. ఎంత విశ్ర...