భారతదేశం, జూన్ 11 -- కావ్య‌ను బొట్టు పెట్టి త‌న పెళ్లికి పిలుస్తుంది యామిని. త‌ప్ప‌కుండా వ‌స్తాన‌ని యామినికి మాటిస్తుంది కావ్య‌. తాను ఒక్క‌దానినే రాకుండా కుటుంబ‌స‌భ్యులంద‌రిని పెళ్లికి తీసుకొస్తాన‌ని చెబుతుంది. కావ్య మాట‌ల‌తో వైదేహి షాక‌వుతుంది. పెళ్లి ప‌నులు ఉన్నాయంటూ హ‌డావిడిగా యామినిని అక్క‌డి నుంచి తీసుకెళుతుంది.

కావ్య ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత యామినికి క్లాస్ ఇస్తుంది వైదేహి. కావ్య‌తో పాటు కుటుంబ‌మంతా వ‌స్తే పెళ్లి ఆపే ప్ర‌య‌త్నాలు చేస్తార‌ని, రాజ్ మ‌న‌సు మారుస్తార‌ని భ‌య‌ప‌డుతుంది. మా పెళ్లిని ఆప‌టం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని యామిని అంటుంది.

పెళ్లికి వ‌స్తాన‌ని యామినికి ఎందుకు మాటిచ్చావ‌ని కావ్య‌ను నిల‌దీస్తాడు సుభాష్‌. కావ్య అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడిందంటే ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేసింద‌ని ఇందిరాదేవి స‌పోర్ట్ చేస్తుంది. పెళ్లి ఆ...