భారతదేశం, జూన్ 18 -- తీర్చుకుంటున్నారా అని కావ్య‌ను ఉద్దేశించి రాజ్ మ‌న‌సులో అనుకుంటాడు. త‌న‌కు మెహందీ పెట్ట‌డం రాద‌ని వైదేహితో చెప్పి త‌ప్పించుకోవాల‌ని చూస్తాడు. కానీ వైదేహి విన‌కుండా రాజ్‌ను యామిని ప‌క్క‌న కూర్చోబెడుతుంది.

మెహందీ ఫంక్ష‌న్ జ‌ర‌గ‌కుండా ఆపుతాన‌ని అన్నావుగా...ఏం చేస్తావ‌ని అప్పును అడుగుతుంది అప‌ర్ణ‌. మీరే చూస్తారుగా అని అప్పు చెబుతుంది. యామినికి రాజ్ మెహందీ పెట్ట‌డానికి రెడీ అవుతాడు. అప్పుడే యామినికి రౌడీ గుణ ఫోన్ చేస్తాడు. అత‌డి ఫోన్ చూడ‌గానే యామిని కంగారు ప‌డుతుంది. పీట‌ల‌పై నుంచి లేస్తుంది. తాను దేశం వదిలి పారిపోవాల‌ని అనుకుంటున్నాన‌ని, అందుకు సాయం చేయ‌మ‌ని యామినిని అడుగుతాడు గుణ‌.

లేదంటే ఇప్పుడే పోలీసుల ద‌గ్గ‌ర‌కు వెళ్లి రాజ్‌, కావ్య‌ల‌ను చంప‌మ‌ని త‌న‌తో డీల్ చేసుకున్న‌ది మీరే అని చెబుతాన‌ని యామినిని బ్లాక్‌మెయిల్ చేస...