భారతదేశం, జూన్ 25 -- స్వ‌ప్న‌ను కిడ్నాప్ చేస్తుంది యామిని. బావే నా స‌ర్వ‌స్వం అనుకున్న నా క‌ల‌ను స‌ర్వ‌నాశ‌నం చేసిన మిమ్మ‌ల్ని వ‌దిలిపెడ‌తాన‌ని ఎలా అనుకున్నావ‌ని కావ్య‌కు ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తుంది యామిని. న‌న్ను అంత సింపుల్‌గా తీసుకోకూడ‌దు అని తెలియ‌దా అని కావ్య‌తో అంటుంది.

స్వ‌ప్న ఇంట్లో క‌నిపించ‌డం లేద‌నే డౌట్ మీకు ఇంకా రాలేదా అని కావ్య‌తో అంటుంది. స్వ‌ప్న హాస్పిట‌ల్‌కు వెళ్ల‌లేద‌ని తానే కిడ్నాప్ చేశాన‌ని చెబుతుంది. మా అక్క‌కు ఏమ‌న్నా జ‌రిగిందో అని యామినికి వార్నింగ్ ఇవ్వ‌బోతుంది కావ్య‌. నీ పాత చింత‌కాయ రొటీన్‌ డైలాగ్స్ ఆపేసి ముందు నీ అక్క‌ను కాపాడుకో అని ఫోన్ క‌ట్ చేస్తుంది యామిని.

స్వ‌ప్న ఎక్క‌డికి వెళ్లింద‌ని రాహుల్‌ను అడుగుతుంది కావ్య‌. పాప‌కు పోలియో డ్రాప్స్ వేయించ‌డానికి హాస్పిట‌ల్‌కు వెళ్లింద‌ని క్యాజువ‌ల్‌గా స‌మాధాన‌మిస్తాడ...