భారతదేశం, ఏప్రిల్ 30 -- ర‌మ్మ‌ని పిల‌వ‌కుండానే మీ ఇంటికి వ‌చ్చి మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టానా అని ఫోన్ చేసి కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. మా ఇంటికి వ‌స్తాన‌ని, సర్‌ప్రైజ్ ఇస్తాన‌ని మీరే చెప్పారు క‌దా అని కావ్య బ‌దులిస్తుంది. అందులో మీ పొర‌పాటు ఏం లేద‌ని అంటుంది. నేను ఇంట్లో అడుగుపెట్ట‌గానే మీరు కంగారు ప‌డ‌టం గ‌మ‌నించాడు. త‌డ‌బ‌డ‌టం చూశాన‌ని రాజ్ అంటాడు. మీరు ఉన్నంత సేపు చాలా సంతోషంగా ఉన్నాన‌ని కావ్య అంటుంది. మ‌న‌సులో మాత్రం మీరు ఇక్క‌డే ఉండిపోతే బాగుండున‌ని అనిపించింద‌ని కావ్య అనుకుంటుంది.

మీరు ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు నేను రావ‌డం, అంత‌సేపు ఉండ‌టం క‌రెక్ట్ కాద‌ని రాజ్ అంటాడు. మీ మావ‌య్య ఏమైనా అన్నాడా అని కావ్య‌ను అడుగుతాడు రాజ్‌. మిమ్మ‌ల్ని చూడ‌గానే మా మావ‌య్య చాలా సంతోష‌ప‌డ్డాడ‌ని కావ్య పొర‌పాటుగా నోరుజారుతుంది. సంతోష‌ప‌డ‌టం ఏంటి అని రాజ్ అడుగుతా...