Hyderabad, జూన్ 12 -- ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తోంది. లయ నటిగా రీ ఎంట్రీ ఇస్తోన్న తమ్ముడి సినిమాలో ఆమెతోపాటు వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వాసిక విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 11న తమ్ముడు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా తమ్ముడు ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నటి లయ మాట్లాడుతూ.. "నేను సినిమా ఇండస్ట్రీ నుంచి విరామం తీసుకుని 20 ఏళ్లవుతోంది. తమ్ముడు మూవీతో తిరి...