Hyderabad, ఏప్రిల్ 28 -- రోజు మొదలుపెట్టే ముందు మనం తీసుకునే మొదటి ఆహారమే బ్రేక్‌ఫాస్ట్. ఇది నిజంగానే రోజులో అత్యంత ముఖ్యమైన మీల్స్‌లో ఒకటి. శరీరం రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత, ఉదయం లేవగానే దానికి శక్తినిచ్చే ఆహారం చాలా అవసరం. అందుకే ఆరోగ్య నిపుణులు అల్పాహారం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని సూచిస్తారు. కానీ, చాలా మంది ఉదయం తొందరలో లేదా సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులు మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.

మనం ఏ భోజనం తిన్నా సరైన సమయానికి తినడం చాలా ముఖ్యం. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇలా చేయడం వల్ల మన శరీరం అనేక ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. సరైన సమయానికి అల్పాహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో వాపు తగ్గుతుంది. జీర్ణక్రియ సాఫీగా జ...