భారతదేశం, డిసెంబర్ 5 -- డిసెంబర్ 5, శుక్రవారం.. నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ అఖండ 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న రోజు ఇది. కానీ ఈ అభిమానులకు గట్టి షాక్ తప్పలేదు. అఖండ 2 రిలీజ్ ను వాయిదా వేస్తూ విడుదలకు కొన్ని గంటల ముందు ప్రొడక్షన్ సంస్థ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సోసల్ మీడియాలో 14 రీల్స్ ప్లస్ పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.

అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు

అఖండ 2 ప్రీమియర్ షోల కోసం గురువారం (డిసెంబర్ 4) ఉదయం నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే సాయంత్రం నిర్మాణ సంస్థ ఈ షోలను రద్దు చేస్తున్నట్లు చెప్పడంతో వాళ్లు ఉసూరుమన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఇండియా వ్యాప్తంగా ప్రీమియర్ షోలను రద్దు చేసినట్లు 14 రీల్స్ ప్లస్ చెప్పింది.

"సాంకేతిక కారణాల వల్ల ఇవాళ ఇండియాలో ఉండాల్సిన అఖండ 2 ప్రీమియర్ షోలను రద్దు చేస్తున్నాం. మా శ...