భారతదేశం, డిసెంబర్ 20 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి ప్రయాణిస్తున్న కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. దీని నుంచి ఆమె ప్రాణాలతో తప్పించుకుంది. ముంబైలో అమెరికన్ డీజే డేవిడ్ గెట్టా సంగీత కచేరీలో పాల్గొనేందుకు వెళ్తున్నప్పుడు నోరా ఫతేహికి ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. నటి, సింగర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీని కారణంగా ఆమె స్వల్పంగా కంకషన్ బారిన పడ్డారు.

నోరా ఫతేహి కారు యాక్సిడెంట్

నటి, సింగర్, డ్యాన్సర్ ఇలా మల్టీ టాలెంటెడ్ అయిన హాట్ బ్యూటీ నోరా ఫతేహి కొద్దిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన వివరాలను పంచుకుంటూ, ఒక సన్నిహిత వర్గం మాట్లాడుతూ.. "డేవిడ్ గెట్టాతో తన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం కోసం సన్‌బర్న్ ఫెస్టివల్‌కు నోరా ఫతేహి వెళ్తుంది. తాగి ఉన్న డ్రైవర్ మరో కారులో వచ్చి ఆమె కారును ఢీకొట...