భారతదేశం, జనవరి 16 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్-డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ క్రేజీ కాంబినేషన్ ను రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా ఓటీటీకి సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్ అయింది.

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న అప్ కమింగ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఇవాళ (జనవరి 16) నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించేసింది. ఇందుకోసం కళ్లు చెదిరే రేటు చెల్లించినట్లు తెలిసింది.

నెట్‌ఫ్లిక్స్ పండగలో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నట్లు శుక్రవారం అనౌన్...