భారతదేశం, జనవరి 25 -- రా అండ్ బోల్డ్ మూవీస్ తో ఎవరేమనుకున్నా పర్లేదని తన స్టైల్లో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి మొదలు యానిమల్ వరకూ డైరెక్టర్ గా అతని రూటే వేరు. మరోవైపు పుష్ప సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన హీరో అల్లు అర్జున్. మరి సందీప్ రెడ్డి వంగా, అల్లు అర్జున్ కాంబో సెట్ అయితే ఎలా ఉంటుంది? అదే జరగబోతుంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. ఎట్టకేలకు అవి నిజమనే క్లారిటీ వచ్చేసింది. సందీప్ డైరెక్సన్ లో అల్లు అర్జున్ మూవీ చేయబోతున్నాడని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చేశాడు. ఓ ఇంటర్వ్యూలో భూషణ్ కుమార్ మాట్లాడుతూ తమ ప్రొడక్షన్ హౌస్ తో సందీప్ రెడ్డి వంగా లైనప్ గురించి చెప్పాడు.

ఆ ఇంటర్వ్యూలో భూష...