భారతదేశం, నవంబర్ 20 -- స్టార్ హీరోయిన్ కృతి సనన్, కబీర్ బహియా డేటింగ్ లో ఉన్నారనే చాలా కాలం నుంచి రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ జంట కూడా తమ వెకేషన్ పిక్స్ ను పోస్టు చేస్తూ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. తాజాగా తన రూమర్డ్ ప్రియుడు కబీర్ బహియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రేమను కురిపించింది కృతి సనన్.

కృతి సనన్ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ కబీర్ బహియా బర్త్ డే సందర్భంగా పోస్టు చేసిన ఫొట్ వైరల్ గా మారింది. వారిద్దరూ కలిసి చేసిన విహారయాత్రకు సంబంధించిన గతంలో ఎప్పుడూ చూడని చిత్రాన్ని పంచుకుంటూ, కృతి సనన్ ఒక ప్రత్యేక సందేశాన్ని రాసింది. అతనితో తాను ఎంత సరదాగా ఉండగలనో చెప్పడానికి సంకోచం లేదని ఆమె పేర్కొంది. కృతి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కబీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కృతి కబీర్‌తో ఉన్న ఒక పాత చిత్రాన్ని పంచుకోవడం ద...