Hyderabad, సెప్టెంబర్ 9 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 821వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో సాగింది. స్వరాజ్ రేవతి కొడుకే అన్న నిజం రుద్రాణి బయటపెట్టడం, అది కాస్తా ఎదురుతన్నడం, ఆ తర్వాత కావ్య, అప్పుల కడుపు పోగొట్టడానికి రుద్రాణి తీర్థంలో పౌడర్ కలపడంలాంటి సీన్లతో సాగిపోయింది. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 9) ఎపిసోడ్ అందరూ రూమ్ లో రేవతితో కలిసి ఉన్న సీన్ తో మొదలవుతుంది. రేవతి ఇలా ముసుగు వేసుకొని ఇంటికి వస్తుందని అందరికీ ముందే తెలుసా అని ఇందిరాదేవి అడుగుతుంది. అవుననడంతో ఆమె ఆశ్చర్యపోతుంది. అప్పుడే అపర్ణ గదిలోకి వస్తుంది. దీంతో అందరూ కంగారు పడతారు. రేవతికి ముసుగు వేయడానికి కావ్య, రాజ్ ప్రయత్నిస్తారు.

ఆమె వచ్చేలోపు ముసుగు వేసి ముఖం కనిపించకుండా చేస్తారు. నీ కొడుకు ఎక్కడ రాధ అని అడుగుతుంది. ఆమ...