Hyderabad, సెప్టెంబర్ 6 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు రాజ్ పాలు తీసుకొచ్చి ఇస్తాడు. పాలల్లో కుంకుమ పువ్వు కాస్తా ఎక్కువగా వేశాను అని రాజ్ చెబుతాడు. కడుపులో పెరిగే బిడ్డను చూసుకుంటూ మురిసిపోతాడు రాజ్. అది చూసి కావ్య ఆశ్చర్యపోతాడు. రాజ్ అమ్మాయే కావాలని అంటాడు. తర్వాత మీ అక్క గురించి ఏం ఆలోచించారు అని కావ్య అడుగుతుంది.

రేపు తీసుకురావడమే. అక్క గురించి నేను చూసుకుంటాను అని చెప్పిన రాజ్ కావ్యను పడుకోమంటాడు. మరోవైపు తలకు టవల్ కట్టుకున్న రాహుల్ ఏదో ఆలోచిస్తే రుద్రాణి వచ్చి అడుగుతుంది. పనివాడిగా పని చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయో అని లెక్కలు వేసుకుంటున్నాను. అందరు కలిసిపోయి హాయిగా ఉన్నారు. రాజ్‌కు పుట్టినవాడు వారసుడు అవుతాడు. నన్ను పనోడిలా చూస్తారు అని రాహుల్ అంటాడు.

నేనుండగా అలా ఎలా జరగినిస్తాను. నీ కూతురు మాత్రమే ఇంటికి వారసుర...