Hyderabad, సెప్టెంబర్ 5 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ప్రెగ్నెన్సీ రిపోర్ట్‌లో సమస్య ఉందని, 9వ నెల వరకు బిడ్డను మోయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 7 నెలల్లోనే డెలివరీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు బేబీ సురక్షితంగా ఉంటుందన్న గ్యారెంటీ లేదు. అలాగే, 9 నెలల వరకు ఆగితే తల్లి ప్రాణాలకే ప్రమాదం అని అప్పు, కల్యాణ్‌తో డాక్టర్ చెబుతుంది.

మరి ఇప్పుడు ఏం చేయాలని డాక్టర్ అడిగితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు అబార్షన్ చేయడం తప్పా ఇంకేం చేయలేం అని డాక్టర్ చెబుతుంది. పెళ్లయిన రెండేళ్లకు తల్లి అయింది. ఎన్నో అవమానాలు పడింది. ఇప్పుడు బిడ్డను కనలేనని తెలిస్తే తట్టుకోలేదు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా చూడండి అని అప్పు అంటుంది. ప్రాణం విలువ మాకు తెలుసు. అయినా మా సుపీరియర్స్‌తో మాట్లాడి చెబుతాను అని డాక్టర్ అంటుంది.

దాంతో అప్పు, కల్యాణ్ వెళ్ల...