Hyderabad, సెప్టెంబర్ 30 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 839వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కావ్య కడుపులో బిడ్డను చంపడానికి రాజ్ తెగించేస్తాడు. కావ్యకు ఇచ్చిన జ్యూస్ లో అబార్షన్ ట్యాబ్లెట్లు కలుపుతాడు. ఆ జ్యూస్ కావ్య తాగేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ కావ్య తన గదిలో పిల్లల పోస్టర్లు అంటించే సీన్ తో మొదలవుతుంది. రాజ్ దగ్గర నిజం రాబట్టమని చెప్పి ఇందిరాదేవి వెళ్లిపోతుంది. ఇంటికి వచ్చిన రాజ్, కల్యాణ్ ఆ పోస్టర్లు చూసి షాక్ తింటారు.

జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చిన వాళ్లు చెప్పకుండా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి బిడ్డను చంపాలని చూశారని, ఇవి చూస్తే అయినా వాళ్లలో మార్పు వస్తుందేమో అని రాజ్ ను కావ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అటు కల్యాణ్ ను కూడా అప్పుతో ఇలాగే చేస్తున్నావా అని కావ్య ...