Hyderabad, సెప్టెంబర్ 3 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 816వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజ్ కు యామిని గురించి కావ్య చెప్పడం, అతడు ఆవేశంగా వాళ్ల ఇంటికి వెళ్లడం, ఆమె కాళ్లు పట్టుకొని మొసలి కన్నీరు కార్చడం లాంటి సీన్లతో సాగింది. అయితే కావ్యకు ప్రెగ్నెన్సీతో ముప్పు అని చివర్లో ఇచ్చిన ట్విస్టు మరో మలుపు తిప్పింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ కావ్యకు రాజ్ కాఫీ తెచ్చివ్వడంతో మొదలవుతుంది. ఇంట్లో వాళ్లకు చూపించాల్సిన అవసరం లేదులే అని కావ్య అనడంతో రాజ్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ తర్వాత కాసేపు రాజ్, కావ్య మధ్య కాఫీ రొమాన్స్ సాగుతుంది. అసలు కాఫీ ఎలా తాగాలో కావ్యకు రాజ్ రొమాంటిక్ గా చెబుతాడు.

అతని ప్రేమ చూసి పొంగిపోయిన కావ్య ఆ యామిని తనను ఎక్కడ దూరం చేస్తుందో అన్న భయం కలిగిందని రాజ్ తో అంటుంది. అప్పుడే ఆ యాక్సిడెంట్, యామిని ఆడి...