Hyderabad, సెప్టెంబర్ 27 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో తన బిడ్డను తాను చంపుకోలేను అని కావ్య స్పృహ తప్పిపడిపోతుంది. అదంతా కల కంటాడు రాజ్. అపర్ణ, సుభాష్‌లకు నిజం చెప్పడం నుంచి కావ్య స్పృహ తప్పిపోవడం వరకు భ్రమ పడతాడు రాజ్. ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పిన కావ్యకు ఈ విషయం చెబుతారు. ఎవరికి చెప్పకుండా అబార్షన్ చేయించాలి అని రాజ్ అనుకుంటాడు.

మరోవైపు రాజ్ చేసిన పని గురించి అంతా మాట్లాడుకుంటారు. కావ్యకు రాజ్ సేవలు చేయడం, డ్రెస్సులు కొనడం, ఆఖరికి అబార్షన్ చేయించడానికి ప్రయత్నించడం ఏంటా అని అంటుంది అపర్ణ. మన ఇంటికి ఏదో పీడ పట్టుకున్నట్లుంది అక్క. వెంటనే శాంతి చేయిస్తే తప్పా సమస్యలు పోయేలా లేవు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏదో ఒకటి చేసి రాజ్ మనసు మార్చాలి. అది ఆలోచించాలి అని ప్రకాశం అంటాడు.

లాభం లేదురా. వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూస...