Hyderabad, సెప్టెంబర్ 26 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాత్రి చంద్రుడిని చూసుకుంటూ రాజ్ ఉండిపోతాడు. అక్కడికి కల్యాణ్ వచ్చి రాజ్‌తో మాట్లాడుతాడు. ఇంకా ఎన్నిరోజులు నిజం చెప్పకుండా నీలో నువ్వే నలిగిపోతావ్. అందరి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతావ్. అందరు నిన్ను మోసగాడిగా చూస్తున్నారు. అది చూస్తే బాధగా ఉంది. ఏం ఉపయోగం లేనప్పుడు నిజం దాచడం వేస్ట్ అన్నా అని కల్యాణ్ అంటాడు.

వదినకు కాకుండా కనీసం అమ్మ నాన్నకు అయినా నిజం చెప్పొచ్చుగా. అమ్మేగా అర్థం చేసుకుంటుంది. నిజం చెబుతావో. లేదా నిందలు మోస్తావో నీ ఇష్టం అని రాజ్‌కు కల్యాణ్ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు రాజ్ మాట్లాడిన దాని గురించి సుభాష్, అపర్ణ మాట్లాడుకుంటారు. తిట్టుకుంటారు. ఇంతలో రాజ్ వస్తాడు. ఏమైందిరా, ఎందుకులా పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నావ్ అని నిలదీస్తుంది అపర్ణ.

నీ బిడ్డను నువ్...