Hyderabad, సెప్టెంబర్ 24 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 834వ ఎపిసోడ్ రాజ్, కావ్య చుట్టూ తిరిగింది. ఏం జరిగినా తనను వదిలి పెట్టి వెళ్లిపోనని కావ్య దగ్గర రాజ్ మాట తీసుకోవడం, అటు అపర్ణ వద్దంటున్నా అలాగే హాస్పిటల్ కు వెళ్లడం, అక్కడ రాజ్ డాక్టర్ కాళ్లు పట్టుకోవడానికి వెళ్లడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగిపోయింది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 24) ఎపిసోడ్ కావ్యతో రాజ్ మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకోని బిడ్డపై మరీ అంత ప్రేమ పెంచుకోవడం అవసరమా అని కావ్యను రాజ్ అడుగుతాడు. ఈ మధ్య ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా మిస్ క్యారీ అవుతున్నాయి కదా అంటాడు. అంతా మంచే జరుగుతుంటే ఎందుకు అలాంటి అపశకునం మాటలు మాట్లాడతారని అంటుంది.

అలాంటిదేమీ జరగదని, తన ప్రాణం పణంగా పెట్టి అయినా బిడ్డను కాపాడతానని కావ్య అనడంతో రాజ్ మరింత ఎమోషనల్ ...