Hyderabad, సెప్టెంబర్ 23 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 833వ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది. ఈ ఎపిసోడ్ మొత్తం రాజ్ చుట్టూనే తిరిగింది. బిడ్డను కోల్పోవడం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవడం, అయితే కావ్యకు తెలియకుండా ఆ పని చేయాలనుకోవడంలాంటి సీన్లు బాధ కలిగిస్తాయి. ఇంకా ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 23) ఎపిసోడ్ హాస్పిటల్లో ఓ వ్యక్తిని రాజ్ తిడుతున్న సీన్ తో మొదలవుతుంది. డబ్బు లేదని బిడ్డను తీసేయడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగిస్తానని రాజ్ అంటాడు. అప్పుడే కల్యాణ్ వచ్చి అతన్ని అడ్డుకుంటాడు. వాళ్లకు క్షమాపణ చెబుతాడు.

రాజ్ ను బయటకు తీసుకెళ్లి ఏం చేస్తున్నావని అడుగుతాడు. ప్రాక్టికల్ గా ఆలోచించు.. బిడ్డను వదులుకొని వదినను కాపాడుకో అని అతనికి స్పష్టం చేస్తాడు. కడుపు నిండిన ...