Hyderabad, సెప్టెంబర్ 22 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 832వ ఎపిసోడ్ లో బిడ్డ కోసం రాజ్ పడే తాపత్రయం ఏంటో కళ్లకు కట్టింది. ఇటు తండ్రిపైకే ఎదురు తిరగడం, అటు హాస్పిటల్లో ఓ పరిచయం లేని వ్యక్తికి బిడ్డ పుట్టడం ఎంత గొప్ప విషయమో చెబుతూ క్లాస్ పీకడం చూస్తే రాజ్ తన బిడ్డ విషయంలో ఎంత ఎమోషనల్ గా ఉన్నాడో అర్థమవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 22) ఎపిసోడ్ తండ్రి సుభాష్ ను రాజ్ నానా మాటలు అనే సీన్ తో మొదలవుతుంది. తన బిడ్డ, కావ్య విషయంలో బాధలో ఉన్న రాజ్.. ఆఫీసుకు ఎందుకు వెళ్లడం లేదని అడిగినందుకు తండ్రిని అనరాని మాటలు అంటాడు. తనకు గతం గుర్తు లేనప్పుడు మీరు ఆఫీసు పనులు చూసుకున్నారు కదా.. అయినా బిజినెస్ నష్టం వస్తే ఏమవుతుంది.. డబ్బు లేకపోతే చచ్చిపోతారా..

ఒక్క రోజైనా అయిన వాళ్ల కోసం బతకండి అంటూ సుభాష్ ను నానా మాటలు అని వెళ్లిపోతాడు. ఇదే అ...