Hyderabad, సెప్టెంబర్ 20 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డాక్టర్‌ను రాజ్, కల్యాణ్ కలుస్తారు. కావ్యను కాపాడమని రాజ్ చెబితే.. మీరు ఏంటీ మళ్లీ మొదటికి వచ్చారు. మీరు అబార్షన్‌కు కావ్యను ఒప్పించారని చెప్పడానికి వచ్చానని అనుకుంటున్నాను అని డాక్టర్ కోప్పడుతుంది. తను ఇప్పటివరకు సంతోషంగా లేదు. ఇప్పుడే ఉంటుంది. మా ఇద్దరికి పుట్టబోయే మొదటి సంతానాన్ని ఎలా చంపుకోమంటారు అని రాజ్ ఎమోషనల్‌గా అడుగుతాడు.

మీరు చెబుతుంది నేను అర్థం చేసుకోగలను. కానీ, ఇప్పుడున్న దారిలో అబార్షన్ తప్పా ఇంకోటి లేదు. కావ్య గర్భసంచి చాలా వీక్‌గా ఉంది. ఎమోషనల్‌గా కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించండి అని డాక్టర్ అంటుంది. ప్రతిదానికి ఓ దారి కచ్చితంగా ఉంటుంది కదా. అబార్షన్ మాట కాకుండా ఇంకో మాట చెప్పండి. నాకు కావ్యతో పాటు కడుపులోని బిడ్డ కూడా కావాలి అని వేడుకుంటాడు రాజ్.

మీకు చె...