Hyderabad, సెప్టెంబర్ 2 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 815వ ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇళ్లు మరోసారి సంతోషాలతో నిండిపోయింది. కావ్యపై రాజ్ ప్రేమ, దాని వల్ల అపర్ణకు కొత్త కష్టాలు రావడం, అటు భార్య ధాన్యం దగ్గర ప్రకాశ్ అడ్డంగా ఇరుక్కుపోవడంలాంటివి ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ రాజ్, కల్యాణ్ తమ గదులు మార్చుకునే సీన్ తో మొదలవుతుంది. నువ్వు చెప్పేది కరెక్ట్ అంటూ రాజ్ ను సమర్థించి మెల్లగా జారుకుంటుంది ఇందిరా దేవి. తనను 9 నెలల కడుపులో మోసి కన్నావు కదా.. ఇప్పుడు మరో 9 నెలలు తన బిడ్డ కోసం ఈ మాత్రం చేయలేవా అంటూ తల్లిని అడుగుతాడు రాజ్.

అటు అపర్ణ, సుభాష్, ధాన్యం, ప్రకాశ్ చేసేది లేక కింది నుంచి పైనున్న గదుల్లోకి మారడానికి ఒప్పుకుంటారు. వీడికి గతం గుర్తుకు రావడం పెద్ద తప్పయినట్లుంది అని ప్...