Hyderabad, సెప్టెంబర్ 19 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రూమ్‌కి వచ్చిన కల్యాణ్‍‌ను రాజ్ బావకు నిజం చెప్పావా. ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు అని అడుగుతుంది అప్పు. నిజం చెప్పి తొందరపడ్డామేమో అనిపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు రెండు జీవితాల మధ్య ఈ సమస్య. అన్నయ్య మనం చెప్పిందానికి ఒప్పుకోవట్లేదు. అటు బిడ్డ, ఇటు వదిన ప్రాణాలు పోగొట్టుకోనని అంటున్నాడని కల్యాణ్ చెబుతాడు.

రేపు హాస్పిటల్‌కు మళ్లీ వెళ్లి టెస్ట్‌లు చేయిద్దామని, ఏ ఒక్క అవకాశం దొరికినా వదులుకోనని అంటున్నాడు అని కల్యాణ్ చెబుతాడు. మరోవైపు పడుకున్న కావ్య దగ్గరికి వెళ్లి రాజ్ ఫీల్ అవుతాడు. కల్యాణ్ ఏదోదే చెబుతున్నాడు. కానీ, నువ్వు ప్రాణం మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో వాడికేం తెలుసు. డాక్టర్స్ చెప్పినా, ఆఖరికి దేవుడు చెప్పిన నిన్ను, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను నేను కాపాడుకుం...