Hyderabad, సెప్టెంబర్ 18 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో మాట్లాడాలని బయటకు వెళ్దామంటాడు కల్యాణ్. ఇంతలో కావ్య పిలిచి ఎక్కడికి అని అడుగుతుంది. కల్యాణ్ మాట్లాడాలని ఉందంటే బయటకు వెళ్తున్నామని రాజ్ చెబుతాడు. అదేదో ఇంట్లో మాట్లాడితే సరిపోతుంది కదా అని కావ్య అంటుంది.

ఇక్కడే మాట్లాడే విషయం అయితే బయటకు ఎందుకు వెళ్తాం. మాట్లాడే చిన్న విషయం కాదు. చెప్పెంత ధైర్యం లేదని కల్యాణ్ అంటాడు. అన్నదమ్ములు కలిసి ఏ గూడుపుఠాని చేయట్లేదుగా. మళ్లీ ఏదైనా బ్యాడ్ న్యూసా. ఇంట్లో ఎప్పుడు మంచి రోజులు ఎక్కువగా ఉండవి కదా. మళ్లీ ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చిందా అని కావ్య అంటుంది.

అవును వదినా ఉపద్రవమే ముంచుకొచ్చింది. అది చెప్పలేకే అన్నయ్యను బయటకు తీసుకెళ్తున్నా అని కల్యాణ్ మనసులో అనుకుంటాడు. సైలెంట్‌గా ఉంటావేంటీ.. ఏమైనా మీ అన్నదమ్ములకు పర్సనల్స్ మాకెందుకు. త్...