Hyderabad, సెప్టెంబర్ 13 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వరాజ్‌ను తల్లిదండ్రులు ప్రేమగా చూడటంతో ఎమోషనల్ అవుతుంది రేవతి. ఇన్నాళ్లు వాడిని వారికి దూరంగా ఉంచానని బాధపడుతుంది. రాజ్, కావ్య ఓదారుస్తారు. రేవతి కన్నీళ్లు తుడుస్తాడు రాజ్. మళ్లీ కొంగు వేసి రేవతిని లోపలికి తీసుకెళ్తారు. రాహుల్ అందరికి అప్పడాలు వేస్తాడు.

ఏమైనా పని చేయడం చాలా కష్టం అంటాడు రాహుల్. ఏమైంది రాధ ఎందుకు వెళ్లిపోయావ్ అని అపర్ణ అడిగితే.. వాళ్ల అమ్మ గుర్తొచ్చిందట అని కావ్య చెబుతుంది. ఎందుకు కలిసి ఉండట్లేదా, గొడవ అయిందా అని రుద్రాణి అడిగితే.. లేదు దూరంగా ఊరిలో ఉన్నారని, తనకు వాళ్ల తల్లి గుర్తొచ్చిందని రాజ్ కవర్ చేస్తాడు. మీ అమ్మ నాన్నలు దూరంగా ఉన్నారని బాధపడకు నేను కూడా మీ అమ్మే అనుకో అని అపర్ణ అంటుంది.

భోజనాలు అయ్యేసరికి ఆ పరదా ఎలా తొలగిస్తానో చూడు అని రుద్రాణి అన...