Hyderabad, సెప్టెంబర్ 11 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 823వ ఎపిసోడ్ ఆసక్తికరమైన ట్విస్టులతో సాగింది. ఎంతో సంతోషంగా ఉన్న కావ్య జీవితంలో మరో కల్లోలం రావడానికి సిద్ధంగా ఉండగా.. అటు రేవతిని అందరి ముందు ముసుగు తీసిన నిలబెడుతుంది రుద్రాణి. అది చూసి అపర్ణ కోపం కట్టలు తెంచుకుంటుంది. ఈ ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ వంటింట్లో కావ్య, ఇందిరాదేవి సీన్ తో మొదలవుతుంది. కావ్య చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని, ఆ రుద్రాణి కళ్లు పడకుండా ఉంటే చాలని కావ్య అంటుంది.

ఆ తర్వాత హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ కావ్య తనలో తనే నవ్వుకుంటూ ఉండగా అప్పు, ఇందిర వస్తారు. అంతలా నవ్వుతున్నావేంటని అడిగితే.. చిన్న పిల్లల వీడియో గేమ్స్ చూస్తూ నవ్వుతున్నట్లు చెబుతుంది. తనకూ ఓ కొడుకు పుట్టి అమ్మ అని పిలి...