Hyderabad, సెప్టెంబర్ 1 -- బ్రహ్మముడి ఈరోజు అంటే 814వ ఎపిసోడ్ రొమాంటిక్ సీన్లతోపాటు ఎమోషనల్ గానూ సాగింది. కావ్యను రాజ్ ఎత్తుకోవడం చూసి అప్పూ కూడా తనను ఎత్తుకోవాలని కల్యాణ్ తో అనడం, తర్వాత అన్నదమ్ములు కలిసి కొత్త స్కెచ్ వేయడం, అటు రాజ్ కాళ్లు యామిని పట్టుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (సెప్టెంబర్ 1) ఎపిసోడ్ కావ్యను రాజ్ క్షమాపణ అడిగే సీన్ తో మొదలవుతుంది. కావ్య తనపై చూపించిన ప్రేమను చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. నీ కడుపులో బిడ్డకు తండ్రి ఎవరని అవమానించినా భరిస్తూ నా గురించి ఆలోచించి నిజం చెప్పలేదని, తన కన్న తల్లి కూడా దానిని తట్టుకోలేక నిజం చెప్పేసిందని రాజ్ అంటాడు.

కావ్యకు రాజ్ క్షమాపణ అడుగుతాడు. దీంతో కంటతడి పెట్టిన కావ్య.. రాజ్ ను కౌగిలించుకుంటుంది. తనపై ఎంత కోపం ఉన్నా.. ఎప్పుడూ తనను విడిచి వెళ్లొద్దని రాజ్ ను ...