Hyderabad, మే 9 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ కావ్య లవ్ స్టోరీని కల్యాణ్, అప్పు చెబుతుంటారు. అది విని తనకు జరిగినట్లే గుర్తు చేసుకుంటాడు రాజ్. మరోవైపు యామిని, రుద్రాణి, రాహుల్ పవర్ పోగొట్టేందుకు మెయిన్ స్విచ్ కోసం వెతుకుతుంటారు. ఇద్దరు ఒకేసారి పవర్ ఆఫ్ చేసేందుకు చూస్తారు. ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. ముగ్గురికి కావాల్సింది ఒక్కటే అని అనుకుంటారు.

శత్రువుకు శత్రువు మిత్రువు అవుతారు అని రుద్రాణి అంటుంది. దాంతో యామిని, రుద్రాణి, రాహుల్ కలిసిపోతారు. మాటలు తర్వాత ముందు పవర్ ఆఫ్ చేయండి అని యామిని అంటుంది. చివరి వరకు మేమిద్దరం పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాం కానీ.. అని కల్యాణ్ చెబుతుంటే పవర్ ఆఫ్ అయిపోతుంది. పవర్ ఆఫ్ చేసి యామిని, రుద్రాణి సంతోషిస్తారు.

ఇప్పుడు వాళ్లు అనుకుంది ఎలా సాధిస్తారో నేను చూస్తాను అని యామిని అంటే.. మేము...