Hyderabad, మే 5 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రిసార్టుకు శ్వేత ఎంట్రీ ఇస్తుంది. రాజ్ గురించి పెద్ద బ్యాడ్ న్యూస్ ఇంత ఆలస్యంగా చెప్పావ్ ఏంటీ. రాజ్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు. రాజ్‌కు గతం గుర్తుకు రావడానికి నేను ఏమైనా చేస్తాను. ఏం చేయను చెప్పు అని శ్వేత అంటుంది.

మీరు కాలేజ్‌లో ఎంత క్లోజో తెలుసుగా మీరు నన్ను రాజ్‌లా అనుకుని నాతో రిపీట్ చేస్తుండాలి. అలా అయినా నాలో తనను తాను గుర్తు చేసుకుంటాడేమో అని నా నమ్మకం అని కల్యాణ్ అంటాడు. షూర్ అని శ్వేత అంటుంది. ఇంతలో రాజ్, కావ్య కారులో వస్తారు. వాళ్లను చూసి అన్నయ్య అంటూ ప్రేమగా దగ్గరికి వెళ్తాడు కల్యాణ్. కానీ, అప్పు చేయి పట్టుకుని ఆపుతుంది.

కల్యాణ్, అప్పులను పరిచయం చేస్తుంది కావ్య. అప్పా.. ఎంత ఉంది.. అప్పు అని రాజ్ అంటాడు. దాంతో అంతా డిసాప్పాయింట్ అవుతారు. జోక్.. జోక్ అని అప్పు మీద జోక్ వేసిన...