Hyderabad, మే 31 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యకు రాజ్ లవ్ ప్రపోజ్ చేస్తుండగా.. యామిని వైదేహి కాల్ చేస్తుంది. కానీ, రాజ్ కాల్ లిఫ్ట్ చేయడు. మళ్లీ రాజ్ చెప్పబోతుంటే కాల్ వస్తుంది. ఆంటీ ఏంటీ కట్ చేస్తున్న మళ్లీ చేస్తుందేంటీ అని రాజ్ అంటాడు. బాబు రామ్ అని వైదేహి అంటుంది. ఏమైంది ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు అని రాజ్ అంటాడు.

యామిని కళ్లు తిరిగిపడిపోయింది అని వైదేహి చెబుతుంది. ఇంట్లో ఉన్నాం, డాక్టర్ గారు వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వే తనను కాపాడగలవు అని వైదేహి అంటుంది. ఇప్పుడే వస్తున్నా అని రాజ్ అంటాడు. సారీ నేను వెళ్లాలి అని కావ్యకు చెప్పి వెళ్లిపోతాడు రాజ్. దాంతో ఇంట్లో వాళ్లంతా నిరాశపడతారు. ఇది కదా అసలు ట్విస్ట్ అంటే. ఆ యామిని అనుకున్నది అనుకున్నట్లు సాధించింది. రాజ్, కావ్య పర్మనెంట్‌గా విడిపోయినట్లే అని రుద్రాణి మాత...