Hyderabad, మే 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో యామిని కాల్ మాట్లాడి పెట్టేస్తుంది. రాజ్ నాలుగు మాటలు మంచిగా మాట్లాడేసరికి ఈజీగా గతం గుర్తు చేసేయొచ్చు అనుకుంటుంది. చెబుతా దీని సంగతి అని యామిని అనుకుంటుంది. మరోవైపు కావ్య లగేజ్‌తో బయలుదేరుతుంది. ఆ విషయం కల్యాణ్‌కు చెప్పి మొత్తం రెడీయేగా అని అడుగుతుంది.

కల్యాణ్ అంతా రెడీగా ఉందంటాడు. కావ్యను చూసిన రుద్రాణి ఎక్కడికి వెళ్తుందో.. కట్టు బొట్టు కొత్తగా ఉంది అని అంటుంది. ఫంక్షన్ ఉందని చెప్పాగా అక్కడికి వెళ్తున్నాను అని అపర్ణకు చెబుతుంది కావ్య. వావ్.. అద్భుతం.. మహాద్భుతం.. మొగుడు చచ్చిపోతే బాధపడాలి. కోడలి పార్టీలు, ఫంక్షన్స్ అని తిరుగుతుంది. అత్తేమో ఈజీగా పర్మిషన్ ఇచ్చేస్తుంది అని రుద్రాణి అంటుంది.

పార్టీలో మొగుడు ఏమయ్యాడని అడిగితే.. నిజం చెప్పాల్సిరాదా. అప్పుడు పరువు పోదా. ఏదో గో...