Hyderabad, మే 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు స్నానం చేసి జుట్టు తుడుచుకుంటుంది. వెనుక నుంచి కల్యాణ్ వస్తాడు. ఇంతలో అప్పుకు కాల్ వస్తుంది. 49 సార్లు తప్పించుకున్న క్రిమినల్ చార్లెస్ కడుపు నొప్పి అంటూ బాధపడుతున్నాడు అని కానిస్టేబుల్ కాల్ చేస్తాడు. అదంతా వాడు నాటకం ఆడుతున్నాడు. మీరు మాత్రం హాస్పిటల్‌కు తీసుకెళ్లకండి అని అప్పు చెబుతుంది.

అందరిముందు కళ్లుగప్పి కన్నుకొట్టి నన్ను రెచ్చగొడతావా.. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాను అని అప్పు కాల్ మాట్లాడుతుండగానే.. వెనుక నుంచి వెళ్లి గట్టిగా వాటేసుకుని అప్పు మెడపై ముద్దు పెడతాడు కల్యాణ్. దాంతో అప్పు గట్టిగా అరుస్తుంది. దానికి కానిస్టేబుల్ ఏమైందని షాక్ అవుతాడు. వదిలేయమని కల్యాణ్‌ను అంటే.. అంత కష్టపడి పట్టుకున్నాం కదా మేడమ్ అని కానిస్టేబుల్ అంటాడు.

మిమ్మల్ని కాదయ్యా అని అప్పు అంట...