Hyderabad, మే 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ దగ్గరికి వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొస్తుంది యామిని. చూడు బావ అని ఇస్తుంది. యామిని వెడ్స్ రామ్ అని ఉంటుంది. కానీ, రాజ్‌కు అంతగా నచ్చదు. లోపల ఇంకా అందంగా ఉంటుంది చూడు అని యామిని అనేసరికి వెడ్డింగ్ కార్డ్ లోపల చూస్తాడు రాజ్. మన ఫ్యూచర్ కూడా ఈ పెళ్లి పత్రిక లాగే ఎంతో అందంగా ఉంటుంది. ఏమంటావ్ బావ అని యామిని అంటుంది.

కానీ, రాజ్ సైలెంట్‌గా ఉండటంతో ఏమైంది బావ అని యామిని అడుగుతుంది. ఏం లేదు. కొంచెం హెడెక్‌గా ఉందని రాజ్ అంటాడు. నార్మల్ హెడెక్ అయితే ట్యాబిలెట్స్‌తో పోతుంది. కానీ నేనే హెడెక్ అయితేనే ప్రాబ్లమ్ బావ అని యామిని అంటుంది. అలా ఎందుకు మాట్లాడతావ్ అని రాజ్ అంటాడు. కొన్ని రోజులుగా నీ ప్రవర్తన వింతగా ఉంది, చాలా బిజీగా ఉంటున్నావ్ అని యామిని అంటుంది.

ఇలానే రేపు పెళ్లి పీటల మీద కూర్చోడాన...