Hyderabad, మే 19 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య పద్ధతి మార్చుకుంటుంది. కావ్యే మారాల్సింది ఉంది. నా మనవడితో పద్ధతిగా నడుచుకో అని ఇందిరాదేవి అంటుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కళావతి గారు నా దగ్గర ఎలా నడుచుకుంటారో ఒక ప్రొగ్రెస్ కార్డ్ ఇస్తాను. అందులో పాస్ అయితేనే మీరు కళావతితో మాట్లాడాలి అని రాజ్ అంటాడు.

వచ్చాడండి దత్తపుత్రుడు. ఎవరి కోసం నా పద్ధతి మార్చుకోను అని కావ్య గట్టిగా చెబుతుంది. ఇంటికి పిలిచి ఇలా అవమానిస్తారా నేను వెళ్లిపోతాను అని రాజ్ అంటే.. ఇందిరాదేవి, అపర్ణ ఆపుతారు. ముందు టిఫిన్ వడ్డించమని అపర్ణ అంటుంది. అసలు చేస్తే కదా. చేయాలనిపించలేదు, చేయలేదు అని కావ్య చెబుతుంది. బాబుకు మసాలా దోశ చేయు అని అపర్ణ ఆర్డర్ వేస్తే కావ్య నేను చేయను చేయను అని లెక్క చేయదు.

అయితే, నేను చేస్తాను. ఐదు రకాల దోశలు వేసి మీ మనవరాలితో తినిపిస్...