భారతదేశం, ఫిబ్రవరి 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వ్యాన్ డ్రైవర్ సూరితో రాహుల్, రేఖ డీజిల్, కండిషన్ గురించి మాట్లాడుతారు. వెళ్లి భోజనం చేసి, స్వీట్స్ తిని రా అని వ్యాన్ కీ తీసుకుని డ్రైవర్‌ను పంపిస్తాడు రాహుల్. రుద్రాణికి కాల్ చేస్తాడు రాహుల్. బాంబ్ పెట్టేందుకు రౌడీ వచ్చాడని చెబుతుంది.

స్వప్నకు కాల్ వెళ్లింది.. ఈ వ్యాన్‌లో కూర్చోదు అని చెబుతాడు రాహుల్. రౌడీ వచ్చి వ్యాన్‌కు బాంబ్ ఫిక్స్ చేస్తుంటాడు. ఇంతలో స్వప్న పాపతో వస్తుంది. అది చూసి రాహుల్ కంగారుపడతాడు. ఏంటీ టెన్షన్ పడుతున్నారు అంటుంది. ఈ వ్యాన్ చెక్ చేయిస్తున్నా అని రాహుల్ అంటాడు.

విజయవాడ ప్రాపర్టీ మేనేజర్ కాల్ చేశాడు. రేపే వెళ్లి మునిసిపాలిటీ వాళ్లతో మాట్లాడమంటున్నాడు అని స్వప్న అంటుంది. అయితే, మనం సెపరేట్‌గా కారు తీసుకుని అటు నుంచి విజయవాడ వెళ్దామని రాహుల్ అంటాడు. సరే...