భారతదేశం, ఫిబ్రవరి 17 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్య రేవతి ఇంట్లో ఉండటంపై నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. కల్యాణ్, అప్పును కిడ్నాప్ చేసిందని అపర్ణతో గొడవ పడుతుంది. నానా మాటలు అంటుంది. దాంతో తను నీ అక్క, చూసి మాట్లాడమని సుభాష్ ఫైర్ అవుతాడు.

పిల్లలు దూరమైన బాధలో ఉంది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి. నోరు తెరవడం పాపమంటే ఎలా. పెద్దవాడివి నువ్వేందుకు ధాన్యంపై అరుస్తున్నావ్ అని సుభాష్‌పై రివర్స్ అవుతాడు ప్రకాశం. పిల్లలు మనసు తెలుసుకుని మాట్లాడమంటున్నాను. ఇంటికి మూల స్తంభాలైన రాజ్, కావ్య గురించి తెలిసి అనడం గురించి అంటున్నాను అని సుభాష్ కౌంటర్ ఇస్తాడు.

మరోవైపు రుద్రాణి, రాహుల్, రేఖ మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుంటారు. తాము అనుకుంది జరిగిందని సంతోషిస్తారు. నేను ఆ మినిస్టర్‌ను అడ్డు పెట్టుకుని ఇంట్లోంకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్...