Hyderabad, సెప్టెంబర్ 14 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రేవతి ముసుగు తీయించి ఎలాగైన బయటపెట్టాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. అందుకోసం పార్టీ పేరు చెప్పి వాడుకుంటుంది. ప్రతి ఒక్కరు డబ్బాలోని చిట్టీ తీసి అందులో ఏది ఉంటే అది చేయాలని, లేకుంటే తాను శిక్షిస్తానని రుద్రాణి చెబుతుంది. దానికి ప్రకాశం, సుభాష్ కౌంటర్స్ వేస్తారు.

తర్వాత రుద్రాణి తండ్రి సీతారామయ్యతో గేమ్ స్టార్ట్ చేస్తుంది. సీతారామయ్యకు డైలాగ్ వస్తే.. ఇద్దరు ఫ్రెండ్స్ గురించి గొప్పగా చెప్పి ఎమోషనల్ అయ్యేలా చేస్తాడు సీతారామయ్య. ఆ తర్వాత భార్య అలక తీర్చే భర్తగా స్వప్న, రాహుల్ డ్యాన్స్ చేస్తారు. వీరిలాగే, అప్పు-కల్యాణ్, ప్రకాశం-ధాన్యలక్ష్మీ, సుభాష్-అపర్ణ డ్యాన్స్ చేస్తారు.

రాజ్, కావ్య కూడా సంతోషంగా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసి అలరిస్తారు. ఇక చివరిగా మిగిలింది గెస్ట్ రా...