Hyderabad, జూన్ 1 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో శోభనం గదిలోకి మళ్లీ వెళ్తారు అప్పు, కల్యాణ్. ఇద్దరు బెడ్‌పై కూర్చొంటారు. కల్యాణ్ సంతోషంగా ఉంటాడు. కానీ, అప్పుకు మెసేజ్ రావడంతో పక్కకు వెళ్లి ఫోన్ చూస్తుంటుంది. పక్కనే అప్పు స్పర్శ తగలకపోయేసరికి పక్కకు చూస్తాడు కల్యాణ్. అక్కడ అప్పు ఏం పట్టనట్లు ఉండేసరికి కల్యాణ్ షాక్ అవుతాడు.

ఏంటీది పొట్టి అలా దూరంగా ఉండిపోయావ్. ఈ రాత్రి కోసం ఎన్నో రాత్రులు ఎదురుచూశాను తెలుసా అని కల్యాణ్ అంటాడు. కవిగారికి మంచి మూడ్ వచ్చినట్లుంది. కానీ, నాకు అంత ఓపిక లేదని అప్పు అంటుంది. ఫస్ట్ నైట్ రోజును అప్పు ఏమాత్రం పట్టించుకోకపోయేసరికి కల్యాణ్‌కు కోపం వస్తుంది. అప్పుపై సీరియస్ అవుతాడు. దాంతో అప్పు కూడా కోప్పడతుంది. ఇద్దరు వాదించుకుంటూ శోభనం రోజున గొడవ పడతారు.

రెండేళ్ల వరకు శోభనమే కాదు ముద్దు ముచ్చట క...