Hyderabad, జూన్ 15 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పంతులును ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు ఇందిరాదేవి, అపర్ణ, కనకం. ఇందిరాదేవిని శాస్త్రి పంతులు బెదిరించినట్లు ఆ విషయాన్ని అతని భార్య కనకాంబరంకు చెబుతామని బెదిరించడంతో యామిని పెళ్లి ఆగిపోయేలా ప్లాన్ చెబుతాడు పంతులు.

అమ్మవారి పూజకు సిద్ధం చేసిన పంతులు యామినిని పూజలో కూర్చోమని చెబుతాడు. దాంతో యామినిని వైదేహి తీసుకొస్తుంది. యామిని వచ్చి పూజలో కూర్చుంటుంది. రాట్నం విరిగిపోయినందుకు దోషానికి పరిహారంగా ఈ పూజ జరుగుతుంటుంది. పూజలో కూర్చున్న యామిని కావ్యవైపు తాను అనుకుంది సాధించినట్లుగా గర్వంగా చూస్తుంది.

యామినితో అమ్మవారి పూజ జరపిస్తాడు పంతులు. తాను చదివిన మంత్రాలు చెప్పమని యామినితో చెప్పిస్తాడు పంతులు. అదంతా చూసిన కనకం దీనికి దోషం పోవాలని ఇంకా మంత్రాలు చదివిపిస్తున్నాడా, మనం ఏం...