Hyderabad, సెప్టెంబర్ 7 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో దుగ్గిరాల ఇంట్లో వినాయక చవితి పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. రాజ్ వచ్చాడు ఆస్తి పోతుందని రాహుల్ బాధపడుతుంటే రుద్రాణి వచ్చి ఓదార్చుతుంది. ఎప్పటికైనా నీ కూతురే ఇంటి వారసులు అవుతుంది. అప్పు, కావ్యకు పిల్లలు పుట్టకుండే చేసే ఐడియా ఉందని చెబుతుంది.

ఇక ఇంటికి పంతులు వస్తాడు. అతనితో అప్పు జాతకం చూపిస్తుంది ధాన్యలక్ష్మీ. పుట్టబోయే అప్పు బిడ్డ నీతికి కట్టుబడి, ఏ పనినైనా సాధించేవరకు వదిలిపెట్టకుండా మొండిగా ఉంటుందని పంతులు చెబుతాడు. అంటే అప్పు ప్రతిరూపమే వస్తుందన్నమాట అని ఇందిరాదేవి అంటుంది. అలాగే, కావ్య జాతకం చూసిన పంతులు కళావతికి ఇద్దరు పిల్లలు పుడతారని, ఆది పరాశక్తి అంశంతో పుడతారని చెబుతాడు.

తన మనవరాలికి కూడా చూడమని రుద్రాణి అంటే.. నీ పెంపకంలో...