భారతదేశం, ఫిబ్రవరి 8 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో తన పాప కాదని తెలిసిన ఆరోగ్యం తల్లడిల్లిపోతున్న కావ్యను దుగ్గిరాల ఇంట్లోవాళ్లంతా మెచ్చుకుంటారు. అదంతా చూసిన రేఖ కోపంగా వెళ్లి రుద్రాణికి చెబుతుంది. నీది చెత్త ఐడియా, ధాన్యలక్ష్మీ‌తో చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు, రాజ్ అంతా నిజం చెప్పేసారు. కావ్యను ఆకాశానికెత్తుస్తున్నారు అని చెబుతుంది రేఖ.

వాళ్లంతా సంతోషంగా ఉండాలన్నా, కావ్య బిడ్డ తన దగ్గరికి రావాలన్న మంత్రి పాపకు ఆపరేషన్ జరగాలి, ఆరోగ్యం బాగుపడాలి. అది జరగకుండా చేసేందుకు మధ్యలో నేనున్నాను అని రుద్రాణి అంటుంది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‌లో దుగ్గిరాల కుటుంబం అంతా కంగారుగా కూర్చుంటారు. డాక్టర్ అనురాధ వచ్చి పాపను ఇవ్వమంటుంది.

అంతా డాక్టర్ మీదే నమ్మకం పెట్టుకున్నామని, ఈ పాప క్షేమంగా ఉంటేనే తన పాప తన దగ్గరికి వస్తుందని, కావ్...