Hyderabad, మే 11 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో తనవల్లే రాజ్ ప్రాణాలకు ప్రమాదం ఏర్పడిందని కావ్య కుమిలిపోతు ఉంటుంది. హాస్పిటల్‌కు కావ్య ఎందుకు రాలేదో కారణం తెలుసుకునేందుకు కళావతికి రాజ్ ఫోన్ కాల్స్ చేస్తుంటాడు. కానీ, ఎన్నిసార్లు రాజ్ కాల్ చేసిన కళావతి ఫోన్ లిఫ్ట్ చేయదు.

మరోవైపు రాజ్ తనను ప్రేమించేలా చేసేందుకు యామిని స్కెచ్ వేస్తుంది. తనంతట తానే పెళ్లికి ఒప్పుకునేలా యామిని ప్లాన్ వేస్తుంది. కావ్య దగ్గరికి అపర్ణ, స్వప్న, కల్యాణ్, అప్పు వస్తారు. అప్పుడు కూడా కావ్య ఫోన్‌కు రాజ్ కాల్ వస్తుంటుంది. కానీ, కావ్య లిఫ్ట్ చేయదు. అది చూసిన అపర్ణ రాజ్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అక్కడ నిలిచున్నావేంటని అడుగుతుంది అపర్ణ.

మాట్లాడి ఏం చేయమంటారు. మాట్లాడి మళ్లీ గతం గుర్తు చేయమంటారా. మీకు ఆయన గురించి చెప్పకముందు ఆయనతో చాలా జాగ్రత్తగా ...