Hyderabad, మే 4 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రిసార్టులో సందీప్ వెడ్డింగ్ యానివర్సరీ కారణంతో రాజ్‌కు గతం గుర్తుకు తెచ్చెందుకు కల్యాణ్, కావ్య, అప్పు ప్లాన్ వేస్తారు. రాజ్‌కు గతం గుర్తు లేదన్న విషయం ఫ్రెండ్స్ అందరికి కల్యాణ్ చెబుతాడు. ఇంతలో మందు తాగుతూ వచ్చిన అర్జున్, కృష్ణ అలియాస్ టోనీ, వాకర్ రాజ్‌పై పదేళ్ల రివేంజ్ తీర్చుకుంటామని చెబుతారు.

కాలేజ్‌లో ప్రిన్సిపాల్ కంటే స్ట్రిక్ట్‌గా రాజ్ ఉండేవారని, ఏం చేయనిచ్చేవాడు కాదని, ఇప్పుడు వాడితో మందు తాగించి, సిగరెట్ స్మోక్ చేయించి దెబ్బకు గతం గుర్తుకు వచ్చేలా చేస్తామని తమ ప్లాన్ చెబుతారు అర్జున్, కృష్ణ. మరోవైపు కారులో రాజ్, కావ్య మాట్లాడుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్ అందరం కలవడం చాలా సంతోషంగా ఉందని రాజ్ అంటాడు.

ఇక కల్యాణ్, అప్పు దగ్గరికి శ్వేత వస్తుంది. రాజ్‌ గతం మర్చిపోవడంపై శ్వేత...