భారతదేశం, డిసెంబర్ 7 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో ఆఫీస్‌లో స్వప్న వచ్చిందని తెలిసి డిజైన్స్ కోసం మరింత డ్రామా చేస్తాడు రాహుల్. అదంతా చూసిన స్వప్న నమ్మేస్తుంది. రాహులే స్వయంగా డిజైన్స్ తయారు చేయించినట్లుగా స్వప్నను నమ్మిస్తాడు.

మరోవైపు రెస్టారెంట్‌లో రాజ్, కావ్య కూర్చొంటారు. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. నా అందాల రాశి ఆరోగ్యం కుదుటపడి అద్భుతం జరిగబోతున్న శుభసందర్భంలో నచ్చిన ఫుడ్‌తో మెచ్చిన తీరుగా పార్టీ సెలబ్రేషన్స్ అని రాజ్ అంటాడు. మీరు అంత ఓవర్ చేస్తుంటే నాకు సిగ్గేస్తుందని కావ్య అంటుంది.

ఇదే కళావతి నాకు ఇదే కావాల్సింది అని రాజ్ అంటాడు. నేను సిగ్గుపడితే మీకు అంత బాగుంటుందా అని కావ్య సిగ్గు పడుతూ అంటుంది. ఒక్కసారి సిగ్గు పడ్డావనుకో చూసి తరించాలని ఉంది కళావతి అని రాజ్ రిక్వెస్టింగ్‌గా అడుగుతాడు. దానికి కావ్య స...