Hyderabad, ఆగస్టు 17 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో అప్పు దగ్గర టాబ్లెట్స్ అయిపోతే వెళ్లి కావ్య దగ్గర తీసుకుంటుంది. అది రుద్రాణి చూస్తుంది. అయితే, ఎపిసోడ్‌లో మాత్రం అది చూపించరు. కానీ, అప్పు వెళ్లగానే కావ్య దగ్గరికి కనకం వస్తుంది. అది రుద్రాణి చూస్తుంది.

కావ్య కడుపుతో ఉంది బయటపెట్టకపోయే పరిస్థితి గురించి కనకం బాధపడుతుంది. కావ్య కూడా అందుకు చింతిస్తుంది. ఇలా కావ్య, కనకం మాట్లాడుకునే మాటలను ధాన్యలక్ష్మీకి చూపిస్తుంది రుద్రాణి. అప్పుకున్నంత అదృష్టం తనకు లేదని కావ్య బాధపడుతుంది. ఇదంతా అసూయతో మాట్లాడే మాటలు అని, ఇదే కావ్య నిజ స్వరూపం అని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి.

తర్వాత అప్పును భోజనం చేయమని టాబ్లెట్స్ తీసుకొస్తానని వెళ్తుంది ధాన్యలక్ష్మీ. ఈలోపే ఇదే సరైన సమయం అనుకుని ఆ టాబ్లెట్స్‌ను రాహుల్‌తో మార్పించేస్తుంది...