భారతదేశం, డిసెంబర్ 14 -- బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో రాజ్, కావ్య ఇంటికి వస్తారు. కావ్య ప్రెగ్నెన్సీ సమస్య గురించి తమకెందుకు చెప్పలేదని, చెప్పకుండా నిజం దాచడానికి ఏముందని, ఎందుకు మోసం చేశారని అపర్ణ, సుభాష్, రుద్రాణి అంటారు. దాంతో రాజ్ అందరికి నిజం చెబుతాడు.

తాను చనిపోయి బిడ్డకే ఊపిరి పోయాలని కళావతి అనుకుంది. ఆ బాధను తనలోనే దాచుకుంది. బిడ్డ పుట్టగానే కళావతి చనిపోతే మీరంతా సంతోషంగా ఉండలేరని మీకు చెప్పలేదు. తాను ఉన్నన్ని రోజులు మీతో సంతోషంగా గడపాలనుకుంది కళావతి. అంతేకానీ మీరు చూపించే సానుభూతి, జాలి మధ్య తాను బతకాలనుకోలేదు. అందుకే నిజం చెప్పలేదు అని రాజ్ అంటాడు.

ఈ దేశంలోని డాక్టర్స్ కాకుంటే వేరే దేశాల్లోని డాక్టర్స్‌ను కలిసేవాళ్లం. ఎలాగైనా కావ్యను బతికించుకునేవాళ్లం అని సుభాష్ అంటాడు. ఇప్పుడు అదంతా అక్కర్లేదు డాడ్. గుడికి...